About

Somepalli Venkata Subbaiah is a Telugu Poet, Andhra Pradesh State Government Servant. He is popular for his works in Naneelu form of poetry. Earlier he served as Mandal Revenue Officer in West Godavari District and then as Deputy Collector in Krishna and Guntur Districts. ''Loyalo Manishi'', ''Challa Kavvam'', ''Tadeka Geetam'', ''Tolakari Chinukulu'', ''Reppala Chappudu'', ''Pachani Vennela'' are his works

Early life:

Venkata Subbaiah was born on 1 May 1958, in Gannavaram Village, Yaddanapudi mandal, Prakasam District. His Parents are Hanumatharao and Nagaratnam. Done his Schooling in Punuru, Yaddanapudi Mandal and Joined Chundi Ranganayakulu College, Chilakaluripet for Degree. Later obtained M.Com privately from Andhra University.

Family:

  • Parents: Hanumantharao and Naga Ratnam
  • Wife: Vijaya Lakshmi
  • Children: Sree Vasista and Sri Viswanatha Virinchi


Profession and Poetry:

Started as Sub Editor to a Telugu Daily Newspaper ''Andhra Jyothi'', Succeeded in 1989 Group-2 Examinations and Posted as Mandal Revenue Officer. He served in Pentapadu, Tadepalligudem, Ganpavaram, Tanuku as MRO and worked as Special Deputy Collector to Pulichintala Project. Later worked as Revenue Divisional Officer in Guntur and Narsapuram.

His Works:

  • ''Loyalo Manishi''(1997) - Mini Poems
  • ''Challa Kavvam'' (2002) - Poetry 
  • ''Tadeka Geetam''(2006) - Poetry
  • ''Tolakari Chinukulu''(2001) - Naneelu
  • ''Reppala Chappudu''(2004) -Naneelu
  • ''Pachani Vennela''(2007) -Naneelu
  • Mahak Matiki (2017) -HIndi Transalation of Tadeka Geetam
  • Matti Porallonchi... (2018) - Poetry

He writes Stories also but they are unpublished. ''Sweet cheet'' is his first story, later he writes ''Rangula Prapancham lo Amma'', ''Aasaku Aavali Vaipu''(click to read), ''kathaakeli'', ''Inthe Sangatulu''.

Rachayitala Sangham, Andhra Pradesh:

Venkata Subbaiah along with other prominent writers established Rachayitala Sangham, Andhra Pradesh (Writers Association, Andhra Pradesh) on 13 September 2015 as to form a common platform for all the writers in newly formed Andhra Pradesh. Its first executive council is formed in September and Venkata Subbaiah elected as President.

Guntur Zilla Rachayitala Sangham:

To promote Innovative approach in Writing Poetry and to Encourage Young Poets Venkata Subbaiah Established Gunturu Jilla Rachayitala Sangham(Guntur District Writers Association) in 2007 and continued as President to the Association for 9 years. Association frequently organizes Writers meets on state level and also organizes Competitions on Stories and Poetry.

Somepalli Sahiti Puraskaram:

On the memory of his Parents Venkata Subbaiah founded Somepalli Saahiti Puraskaram and conducting Short Story Competition every year and winners are awarded.

Death

Somepalli Venkata Subbaiah Died on 14th December 2023 at the age of 65 years due to stroke.


తెలుగు:


సోమేపల్లి వెంకట సుబ్బయ్య  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి, రచయిత.  తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఒకరు. నానీల సృష్టికర్త ఆచార్య ఎన్.గోపి నానీల నాన్న ఐతే, వెంకట సుబ్బయ్య నానీల చిన్నాన్న గా సాహితీ లోకంలో స్థానం పొందారు. మండల రెవిన్యూ అధికారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో విధులను నిర్వర్తించారు. తదనంతరం డిప్యూటీ కలెక్టరుగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో పనిచేశారు. ''లోయలో మనిషి'', ''చల్లకవ్వం'', తదేకగీతం, ''తొలకరి చినుకులు'', రెప్పల చప్పుడు, ''పచ్చని వెన్నెల'' ఆయన ప్రముఖ రచనలు

బాల్యము, విద్య:

వెంకట సుబ్బయ్య 1958వ సంవత్సరం మే 1వ తేదిన హనుమంతరావు, నాగరత్నం దంపతులకు జన్మించారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని గన్నవరం  గ్రామం ఆయన జన్మస్తలం. 
యద్దనపూడి మండలం పూనూరులో పాఠశాల, చిలకలూరిపేటలోని చుండి రంగనాయకులు కళాశాలలో ఉన్నత విద్యనూ అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ప్రైవేటుగా M.Com డిగ్రీ పొందారు.

కుటుంబం:

  • తల్లిదండ్రులు : హనుమంతరావు, నాగరత్నం.
  • సతీమణి : విజయలక్ష్మి
  • కుమారులు : శ్రీ వశిష్ట, శ్రీ విశ్వనాథ విరించి

వృత్తి,కవిత్వం:

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పిమ్మట 1989 గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులై ఎం.ఆర్.ఓగా నియమితులు అయ్యారు.పశ్చిమ గోదావరిజిల్లాలోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకులలో విధులను నిర్వర్తించారు. తదనంతరం 2003లో పులిచింతల ప్రాజెక్టుకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. 2006 గుంటూరు, నర్సాపురం ఆర్.డీ.ఒగా తర్వాత గుడివాడ ఆర్.డీ.ఓ గా, ప్రస్తుతం గుంటూరు జిల్లాకు జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి (సి.ఇ.ఓ)గా పనిచేస్తున్నారు.

 రచనలు :

  •  లోయలోమనిషి (1997) - మినీ కవితా సంకలనం 
  • తొలకరి చినుకులు (2001) -నానీలు 
  • చల్లకవ్వం (2002) -వచన కవితా సంకలనం 
  • రెప్పల చప్పుడు (2004) -నానీలు 
  • తదేకగీతం (2006) -వచన కవితా సంకలనం 
  • పచ్చని వెన్నెల (2007) -నానీలు
  • మహక్ మాటీకి (2017)- తదేకగీతం కు హిందీ అనువాదం
  • మట్టి పొరల్లోంచి.. (2018)- వచన కవితా సంకలనం
  • నాగలికి నా నమస్కారం (2022) - నానీలు
వీరి మొట్టమొదటి కథానిక ''స్వీట్ చీట్'', తర్వాత ''రంగుల ప్రపంచంలో అమ్మ'',''ఆశకు ఆవలివైపు''(చదవటానికి click చేయండి), ''కథాకేళి'', ''ఇంతే సంగతులు'' మొదలైన కథలు రాశారు. 
సోమేపల్లి వెంకట సుబ్బయ్య రాసిన తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నల నానీల సంపుటాలలోని కొన్ని నానీలను ఎంపికచేసి "శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య నానీలు" అని తలతోటి పృథ్విరాజ్ తను వ్యాఖ్యాతగా ఆడియో/వీడియో సీడీలుగా రూపొందించారు.

గుంటూరు జిల్లా రచయితల సంఘం:

కవిత్వ రచనలో వినూత్న విధానాన్ని,యువరచయితలను ప్రోత్సహించటం కోసం 2007లో గుంటూరు జిల్లా రచయితల సంఘం నెలకొల్పి, దానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ అనేక సాహిత్య కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయటం, కథా కవిత్వ పోటీలను నిర్వహిస్తూ ఉంటారు.
2008వ సంవత్సరం వీరు రాష్ట్ర స్థాయి మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం:

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర రచయితలను ఒకే వేదిక పైకి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ను సెప్టెంబర్ 13, 2015న ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు

సోమేపల్లి సాహితీ పురస్కారం:

సోమేపల్లి వెంకట సుబ్బయ్య వారి తల్లిదండ్రుల స్మృత్యార్థం ఈ పురస్కారం అందచేస్తారు. 
ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో చిన్న కథల పోటి నిర్వహించి విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారం అందచేస్తారు

మరణం

సోమేపల్లి వెంకటసుబ్బయ్య 2023 డిసెంబర్ 14న అనారోగ్యంతో మరణించారు