Friday, September 28, 2018

వినుకొండ నుండి విశ్వనరుడైజాషువ


నవ యుగ కవి చాక్రవర్తి గుఱ్ఱం జాషువాను ఈనాటి కవులందరూ స్పూర్తిగా తీసుకోవాలి. అస్పృశ్యత, మూఢ నమ్మకాలపై ఆయన తన కవిత్వం ద్వారా పోరాటం జరిపారు. సమస్యలు రూపం మార్చుకొని ఈ నాటి సమాజంలో కుడా రాజ్యమేలుతున్నాయి. వాటిని రూపుమాపాల్సిన బాధ్యత కవులు, రచయితలూ, కళాకారులపై ఉంది.

జాషువ కేవలం దళిత కవే కాదు. వినుకొండ నుంచి విశ్వనరుడిగా ఎదిగిన గొప్ప కవి. ఆయనే చెప్పినట్టుగా "సుకవి జీవించు ప్రజల నాల్కల యందు" అన్న మాట అక్షర సత్యం. ఈనాటికీ ఏనాటికీ జాషువ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు. తక్కువ కులంగా భావించబడిన కులంలో జన్మించి ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై తిరగబడి ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. ఆయనకు జీవితమే పాఠాలు నేర్పింది.

ఆయన "నా గురువులు ఇద్దరు - పేదరికం, కుల మత బేధం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్యాన్ని, కుల బేధాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటి పై కత్తి కట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం" అని తన కవితా విధానాన్ని స్పష్టం చేశారు. ఈ నాటి సంక్లిష్ట సమాజంలో  జాషువ విధానాన్ని ఆచరించాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. ఆత్మన్యూనతా భావాన్ని వీడనాడి విశ్వాసంతో ముందుకు సాగాలి.
మానవతా కవితా మూర్తి జాషువ ఆశయాలకు అనుగుణంగా సమాజం కుల, మత విద్వేషాలను విడనాడి ప్రతి మనిషీ సాటి మనిషిలో మానవత్వాన్ని దర్శించగలిగినప్పుడే ఆయన కవితా స్పూర్తికి ఘనమైన నివాళి. జాషువా స్పూర్తితో ముందుకు సాగుదాం..

-సోమేపల్లి వెంకట సుబ్బయ్య

Saturday, July 28, 2018

"మట్టి పొరల్లోంచి..." ఆవిష్కరణ ఫోటో

గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 18-05-2018న సాయంత్రం 6 గంటలకు గుంటూరు అన్నమయ్య కళావేదికపై సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన ''మట్టి పొరల్లోంచి...' కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు పుస్తక పరిచయం చేశారు. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ ముఖ్య అతిథి.

Friday, July 6, 2018

Somepalli Venkata Subbaiah Photos

Somepalli Venkata Subbaiah Photos

 (Somepalli Venkata Subbaiah ) (As CEO Zilla Parishad, Guntur District)
(In "Matti Porallonchi..." Book Release Event)


(కథా రచనా శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న సోమేపల్లి వెంకట సుబ్బయ్య)

Wednesday, June 27, 2018

మట్టి పొరల్లోంచి కవితా సంపుటి సమీక్ష "గోదావరి" పత్రికలో


సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన "మట్టి పొరల్లోంచి..." కవితా సంపుటి మీద మంజు యనమదల గారి సమీక్ష  "గోదావరి"  పత్రిక సాహిత్య పేజీలో 27-06-2018న ప్రచురితంమట్టి పొరల్లోంచి సమీక్ష ప్రజాశక్తి పత్రికలో

ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో:


వెబ్ లింక్: http://www.prajasakti.com/Article/Sneha/2048399 ప్రజాశక్తి గుంటూరు జిల్లా పత్రికలో:Monday, May 21, 2018

మట్టి పొరల్లోంచి - పత్రికల్లో


మట్టి పొరల్లోంచి పుస్తకావిష్కరణ ఆహ్వాన పత్రిక


Sunday, February 4, 2018

10వ సోమేపల్లి సాహితీ పురస్కారాలు- విజేతలు

"10వ సోమేపల్లి సాహితీ పురస్కారం -2017"  విజేతలుమొత్తం 163  కథలు పోటీకి రాగా కింది కథలకు పురస్కారం లభించింది. విజేతలకి త్వరలో పురస్కార ప్రదానం చేస్తారు. ప్రముఖ రచయిత చిల్లర భవానీదేవి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
నిమజ్జనం
Nimajjanam
వదలి రాధాకృష్ణ
Vadali Radhakrishna
ద్వితీయ
Second
బిచ్చగాడు
Bichhagadu
జి.ఎస్.కె.సాయిబాబా
G S K Saibaba
తృతీయ
Third
వార్డెన్
Warden
శిoగరాజు శ్రీనివాసరావు
Singaraju Srinivasrao
ఉత్తమ
Best
సమీనా
Sameena
జి అనసూయ
G Anasuya
ఉత్తమ
Best
చీకటి దారిలో
Cheekati Darilo
తాటికోల పద్మావతి
Taatikola Padmavati
ఉత్తమ
Best
జననీ జన్మభూమి
Jnani Janmabhoomi
శివాని 
Sivaani
ఉత్తమ
Best
దేవుడు వరమిచ్చినా
Devudu Varamichhina
కోపూరి పుష్పాదేవి
Kopuri Pushpadevi
ఉత్తమ
Best
వారధి
Vaaradhi
సి యమునా
C Yamuna

Video Gallery

Video Gallery

Somepalli Venkata Subbaiah

Somepalli Venkata Subbaiah HCV Interview:


Somepalli Venkata Subbaiah at 24 Gantala Kavi Sammelanam:


Somepalli Venkata Subbaiah book 'Reppala Chappudu' Inaguration:


Photos Gallery

Photo Gallery
 Somepalli Sahiti Puraskaram Photos